Understanding Friendship and Relationships
జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటారు.
మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు ఈ రెండింటికీ తేడా తెలుసుకోవాలి.
స్నేహితులు ఎంతమందైనా ఉండొచ్చు.
మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడు అని పరిచయం చేయాలి.
మితము నుంచి ఋతం లోకి తీసుకువెళ్ళగలిగినవాడైతే మిత్రుడు.
స్నేహము అంటే అంటుకుని ఉండడం.
కాకపోతే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు.
కానీ అక్కడివరకే స్నేహం.
దానివలన మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటటువంటిది కుదరదు. ఇద్దరూ కలిసి ఓ రైతుబజార్ కి వెళ్ళొచ్చు.
కానీ మిత్రుడు వేరు.
మిత్రుడు ఏం చేస్తాడంటే మితము, అంటే
మీకు లేనిది, మీరు పొందడం సాధ్యం కానిది,
మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని
చాలా పెంచి, సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన,
దిద్దగలిగినవాడిని మిత్రుడు అంటారు.
మితము నుండి ఋతం లోకి తీసుకువెళ్తాడు.
End of transcript · 106 words