Cultural Practices in Marriage and Agriculture

ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళయినటువంటి దంపతుల్ని ఒకచోట ఉండొద్దు అంటారు.

ఒకచోట కొత్తగా పెళ్ళయిన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే,

ఏదో అంతకుముందు పెళ్ళవుతుంది, ఏ చైత్ర మాసంలోనో, వైశాఖ మాసంలోనో పెళ్ళయింది అనుకోండి.

అయితే కొత్తగా పెళ్ళయింది కదూ, వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది.

ఇవతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది. ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి, లేకపోతే పంట రాదు.

రైతు తెల్లవారుజామున ఏ మూడు గంటలకో ఆకాశం మబ్బేసి, గాలి వేసి, చినుకులు టప టప పడుతుంటే,

గబగబా ఇంట్లో పెద్దాయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు.

కొడుకు కొత్తగా పెళ్ళయింది, తండ్రి వెంట వెళ్ళాలి. కానీ కొత్తగా పెళ్ళయింది కదూ, భార్యతో కలిసి పడుకుని ఉండిపోతాడు.

పడుకుని ఉండిపోతే అత్తగారికి కోపం వస్తుంది.

"పెద్దాయన, మామగారు వెళ్ళారు, ఏ నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించొద్దా? నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి" అంటుంది.

ఈ ఒక్క నెల ఆషాఢ మాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి,

ఆరు నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది.

అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని,

అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు, కోడలు అందరూ సంతోషంగా ఉంటారని,

దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు.

ఆచారం ఏదైనా ఉంటే దాని వెనుక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప,

నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు.

కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు, తప్పు అని ఖండించడం కన్నా దురాచారం, అల్పబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు.

End of transcript · 186 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal