Telugu transcript
స్మశానంలోనైనా కూర్చోకపోతే ఉగ్రభూతాలొచ్చి ఒళ్ళమీద పడిపోయి
ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వవని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతాడు.
పార్వతీదేవి అడిగింది మహాభారతం అనుశాసనిక పర్వంలో
శుభ్రమైన కైలాసం ఉండగా ఇంత ఐశ్వర్యం ఉండగా
చింతామణి గృహం ఉండగా స్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది.
అడిగితే ఆయన చెప్పాడు
పార్వతీ బతికున్నన్నాళ్ళు అన్నిచోట్లకీ వెళతారు
ఏమీ తోచట్లేదు స్మశానానికి వెళ్ళొద్దామని ఎవరూ రారు పార్వతీ.
నేను అంతవాణ్ణంటాడు పొడుగ్గా ఉన్నానంటాడు
తెల్లగా ఉన్నానంటాడు పండితుణ్ణంటాడు
పద్యాలు నాకు నోటికొచ్చంటాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు
నాకు పాటలొచ్చంటాడు నేను నాట్యం చేస్తానంటాడు
నేను అధికారినంటాడు నా దగ్గర డబ్బుందంటాడు
నేను పాట పాడగలనంటాడు
ఇన్నీ ఉన్నాయనుకున్నవాడిలోంచి ఊపిరి బయటికెళ్ళిపోయిన తర్వాత
వాణ్ణి తీసుకెళ్ళి నాలుగు కొత్త కర్రల మీద పడుకోబెట్టి
చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి
అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే
జీవుడు లేచి నిలబడి
పుర్రె పగిలిపోయిన తర్వాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే
చీకటి పడిపోయాక
అయ్యబాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు
నా వాళ్ళన్నవాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను
ఒక్కడు లేడని ఏడుస్తుంటే
నేను ఉన్నానురా అని చెప్పడానికి
నేను కూడా లేకపోతే చచ్చినవాడు వెయ్యిమార్లు చచ్చిపోతారని
అక్కడ ఉన్నాను పార్వతీ నా కర్మ కాలక కాదన్నాడు.
End of transcript · 139 words