Lessons from Ekalavya's Story
అంటే గురువు ఏకలవ్యుని బొటనవేలు తీసేసాడు. ఎందుకు తీసేసాడు?
అంటే ఏదో అర్జునుడి కన్నా గొప్పవాడైపోయాడని తీసేయలేదు.
పాండవులు ద్రోణాచార్యుల వారితో కలిసి వేటకెళ్లారు.
వేటకెందుకు వెళ్ళాలి? వాళ్ళు ధనుర్విద్య నేర్చుకున్నారు.
ఒక పరిగెడుతున్నటువంటి మృగం మీద బాణం వేయగలడా వేయలేడా పరీక్షించడానికి తీసుకెళ్ళాడు.
అక్కడ వాళ్ళు వేటకుక్కల్ని తీసుకెళ్లారు.
వేటకుక్క అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది.
ఎవరైనా చాలా విచిత్రంగా కనపడ్డారనుకోండి అది మొరుగుతుంది.
అలా ఆ కుక్క చూసింది ఏకలవ్యుణ్ణి.
ఏంటి విచిత్రంగా ఉన్నాడు? ఈ ఈకలన్నీ తలకి కట్టుకున్నాడు.
మొలకేమో జంతు చర్మం కట్టుకున్నాడు. దానికి విచిత్రంగా అనిపించింది.
అనిపించి భౌ భౌ అని అరిచింది.
తనని చూసి కుక్క అరిచింది అన్న కోపంతో
ఆరు బాణాలు ఇలా, ఆరు బాణాలు ఇలా కొట్టాడు కుక్క నోట్లోకి.
ఎవరైనా ఇలా వేస్తారు.
ఇలా వెళ్లి ఇలా, ఇలా వెళ్లి ఇలా
ఆరు బాణాలు కుక్క నోట్లో కింది దవడకి, ఆరు బాణాలు పై దవడకి కొట్టాడు.
కుక్క నోరు మళ్ళీ మూసుకోకుండా, భౌ అని అరవకుండా కొట్టాడు.
కుక్క వగరుస్తూ వచ్చింది. చూశాడు ద్రోణాచార్యుల వారు.
అయోగ్యుడికి విలువిద్య దొరికింది ఎక్కడో.
ఒక కుక్కకి మొరగడం ధర్మం.
మొరగడం ధర్మమైనటువంటి కుక్క మొరిగితే ఓర్చలేక ఆరు బాణాలు పైకి, ఆరు బాణాలు కిందకి కొట్టాడు.
సంస్కారం లేని చోటికి విద్య అబ్బింది.
ఈ విద్య వాడి చేతిలో ఉంటే వాడు తన అహంకారంతో ఎవరినైనా పాడు చేస్తాడు.
వాడికి ఉండకూడదు ఆ విద్య అనుకున్నాడు.
వెతుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడిది ఈ విద్య అని అడిగాడు.
మీ బొమ్మ పెట్టే నేర్చుకున్నాను అన్నాడు.
నా బొమ్మ పెట్టి నేర్చుకున్నాడు కదా అని అనుమతించలేదు. నీ బొటనవేలు ఇయ్యి అన్నాడు.
ఎందుకని? ఖచ్చితంగా ఇతను తప్పు మార్గంలో వెళ్తాడని లెక్కకట్టాడు గురువు.
End of transcript · 193 words