Analysis of Dance Poetry and Meaning

ననృనన ననృనన నృన నన ననృనన న ననృన ననృనన నృననన నృనన

నృత్వద్వీయ సుఖ విక్రమ జృంభణ సంచలన్నభో న్ననృన

దిక్క్వణన్ననృన ననృనన ననృనన ననృన స్వనన్ననృన

తాండవాటన నకారనుత బసవేశ పాహిమాం!

పంచ పాషాణ పద్యాలు ఐదు పద్యాలలోని నాలుగు పద్యాలు పాల్కురికి సోమనాథుడు గారు రచించారని చెప్పుకున్నాం కదండీ.

ఇప్పటివరకు మూడు పద్యాలని చెప్పుకున్నాము, ఇది నాలుగవ పద్యము పాల్కురికి సోమనాథుడు గారు రచించారు.

ఈ పద్యంలోని కొన్ని అర్థాలను చెప్పుకొని భావంలోకి వెళ్ళిపోదాము.

నృత్వద్వీయ సుఖ విక్రమ జృంభణ సంచలన్నభో న్ననృన

నృత్వద్వీయ... నృత్... నృత్త... నాట్యము, నృత్యము. త్వదీయ... తత్ అంటే నీవు, దీయ అంటే చెందినది లేదా

సంబంధించినది. నీకు చెందినది లేదా నీకు సంబంధించినది త్వదీయ అంటే.

సుఖ అంటే ఆనందము లేదా సంతోషము. విక్రమ అంటే పరాక్రమము లేదా శక్తి లేదా ధైర్యము.

జృంభణ అంటే విస్తరించడము, వ్యాపించడము.

సంచలన్నభో... సంచలన అంటే కంపించడము, కదలడము, చలనము.

అభో... సంచలన్నభో అని ఉంది కదా, అభో అంటే ఆకాశము.

దిక్క్వణన్ననృన... దిక్ అని అంటే దిక్కులయందు, క్వణత్... క్వణ అని అంటే మ్రోగుచున్న అని అర్థము.

స్వనన్ననృన... స్వనత్ అని అంటే మ్రోగటము, శబ్దము, గర్జన అని అర్థము. భావంలోకి వెళ్ళిపోదామా?

ఓ బసవేశ్వరా! ఓ పరమేశ్వరా! నీవు ఆనంద తాండవంలో నాట్యం చేస్తున్నప్పుడు

ననృనన ననృనన నృన నన ననృనన న ననృన ననృనన నృననన నృనన అనే శబ్దాలు పుడుతున్నాయి.

నీ పవిత్రమైన తాండవము పరాక్రమముతో విస్తరిస్తూ ఆకాశమంతా కూడా కదిలిపోతుంది.

ఉన్నన మృన అను శబ్దములతో దిక్కులయందు ప్రతిధ్వనిస్తుంది.

మృననన ననృనన ననృనన ననృనన అనే శబ్దములతో నీవు తాండవం చేస్తున్నప్పుడు దిక్కులయందు మారుమ్రోగిపోతున్నాయి.

తాండవ నృత్యంలో అటు ఇటు తిరుగువాడా, నిన్ను 'న' అనే అక్షరంతో పలుమార్లు స్తుతింపబడుతున్న ఓ పరమశివ!

ఓ బసవేశ్వరా పాహిమాం, నన్ను రక్షించుము, నన్ను కాపాడుము అని అర్థము. థాంక్యూ.

End of transcript · 206 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal