Understanding Personal Dharma Responsibilities

ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మము అన్న మాట ఎప్పుడూ మన వైపునుంచి ఉంటుంది తప్ప,

ధర్మము అవతలి వారిని బట్టి ఉండదు.

నేను అన్న మాట మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను.

భర్తృధర్మము, నేను భర్తగా చేయవలసిన పని.

భార్య గయ్యాళిదా, భార్య నాతో అనుకూలమైందా అన్నదాన్ని బట్టి మారదు.

నేను భర్తను గనుక, నేను చేయవలసినటువంటి ధర్మాన్ని నేను తీసుకుని వెళ్ళిపోవాలి.

మా ఆవిడ చాలా మంచిది కాబట్టి నేను బాగా ఉంటానండి, మా ఆవిడ గయ్యాళిది కాబట్టి నేను ఉండనండి, కుదరదు.

భర్తగా నీ ధర్మం నువ్వు చేయాలి.

పుత్రధర్మము, మా నాన్నగారు అయినదానికి కానిదానికి నన్ను తిడతారండి,

అందుకని మా నాన్నగారి దగ్గర నేను ఉండనండి, తప్పు.

మీ నాన్నగారు తిట్టారా కొట్టారా పక్కన పెట్టు, పుత్రుడిగా నీ తండ్రిని సేవించడం నీ ధర్మం.

అవతలి వారిని బట్టి ధర్మం ఉండదు, నీ వైపునుంచి ధర్మం ఉంటుంది.

End of transcript · 103 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal