Discussion on Spiritual Teachers and God

స్వామి ఇప్పుడు భగవంతుడు ఆచార్యుడు వీళ్లిద్దరినీ

తీసుకుంటే ఎవరు గొప్పవారు స్వామి?

వీళ్లిద్దరినీ తీసుకుంటే

ఒక రకంగా చూస్తే ఆచార్యులు గొప్పవారు,

ఒక రకంగా చూస్తే భగవంతుడు గొప్పవాడు.

అదేంటండీ ఆచార్యులు గొప్పవారు ఎలా? భగవంతుడు గొప్పవాడు ఎలా?

అంటే

ఆచార్యులు మనకు

భగవంతుణ్ణి చూపించేవారు.

ఆ భగవంతుణ్ణి చూపించిందే ఎవరు అంటే ఆచార్యులే చూపించారు.

అందుకని భగవంతుణ్ణి మనకిచ్చినవారు గొప్ప అందుకని ఆచార్యులే గొప్ప

అంటాం.

కానీ ఒక రకంగా చూసాం అంటే

ఆచార్యులను మనకిచ్చినది ఎవరు? భగవంతుడే ఇచ్చాడు.

భగవంతుడు తన కృపతో సంకల్పించి మనకు ఒక

ఆచార్యుణ్ణి ఇచ్చాడన్నమాట. అందుకని

ఒక రకంగా చూస్తే ఆచార్యులు గొప్పవారు, ఒక రకంగా చూస్తే భగవంతుడు గొప్పవాడు

అని చెప్పవచ్చు.

కానీ దీంట్లో మనకు ఎక్కువ ఉపకారం

నేరుగా చేసేది ఎవరు అంటే ఆచార్యులే.

మీరు వచ్చారు భగవంతుణ్ణి దర్శించుకున్నారు శ్రీరంగంలో,

భగవంతుడు ఏమైనా మీతో మాట్లాడాడా? "ఏంట్రా రఘునాథా

బాగున్నావా? సింహాద్రి నాథుడు ఎలా ఉన్నాడు?" అని

అడిగారా?

ఏం లేదు. వారు కటాక్షిస్తారు, కృపను

ప్రవహింపజేస్తారు. కానీ మనకు సరైన

మార్గ ప్రదర్శన

చేసేది ఎవరు అంటే ఆచార్యులే. వారేకదా మనతో

మాట్లాడేవారు. మన కష్టాలను

వింటాడేమో భగవంతుడు కానీ తిరిగి మాట్లాడేది ఎవరు?

అంటే ఆచార్యులే. కానీ అందుకని మనము భగవంతుణ్ణి

కించపరుస్తున్నామా? అంటే అస్సలు లేదండి.

End of transcript · 143 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal