శివ స్తోత్రం: శ్రీకంఠ లోకేశ మహాదేవుని స్తుతి
1 min Faith
1 min Faith
శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహార హారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా విరూపాక్షా దక్షాధ్వర ధ్వంసకా దేవా
నీదైన తత్త్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యత్మ యోగంబు సర్వ క్రియ కారణంబు అంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచు నిన్ను భావింతురీశాన సర్వేశ్వరా
సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికార ప్రభావా భవానీ పతీ నీవు లోక త్రయీ వర్తనంబుల్ మహా వాయు ఖాతాగ్ని సోమార్క తోయంబులన్ జేసి సంసార చక్ర క్రియాయంత్ర బాహుండవై తాది దేవాది దేవా
మహాదేవా నిత్యంబు నత్యంత యోగ స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభా జ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుడిత క్రోధ రాగాది దోషులు యతీంద్రులు యతాత్ములు
భవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులై రవ్యయా భవ్య సేవ్యా భవా భర్గ భట్టారకా భార్గవాగత్ సకుచ్ఛాది నానా ముని స్తోత్ర దత్తావధానా లలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ
భస్మానులిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబులన్ సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్రా మహేంద్రాదులు నిశాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా విశ్వకర్తా సురభ్యర్థితా నాకవభ్యర్థితంబుల్
ప్రసాదింపు కారుణ్య మూర్తీ త్రిలోకైక నాథా మహాదేవ దేవా నమస్తే నమస్తే నమః
End of transcript · 130 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.