శ్రీకాళహస్తి పాతాళ గణపతి వద్ద చెప్పాల్సిన నాలుగు నామాలు
2 min About India Faith
2 min About India Faith
ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి మాత్రం ఒక విశేషం ఉంది.
ఇక్కడ విఘ్నేశ్వరుడు అగస్త్యుని యొక్క పూజకు సంతసించి ఒక విశేషాన్ని ప్రకటించాడు.
పదహారులో నాలుగవ వంతు ఈ క్షేత్రంలో ప్రవేశించి పాతాళ గణపతి దగ్గరికి వచ్చి చెప్తే చాలు.
నాలుగే నామములు పలకాలి ఇక్కడ. గణపతి దగ్గరికి వెళ్లి అథవా వెళ్లి అక్కడ నిలబడి చెప్పి బయటికి వస్తుంటే వెనకాతల చాలామంది ఉండిపోతారు కదండీ అనుకుంటే, మెట్లు దిగక ముందే నిలబడి నాలుగే నాలుగు నామములు చెప్పాలి.
ఏమని చెప్పాలి అంటే గజాననారి అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి అసురుడు, రాక్షసునికి శత్రువైనటువంటి వాడు.
గజానన అంటే ఏనుగు ముఖమున్నవాడు, అరి అంటే శత్రువు.
గజాననారి ఏనుగు ముఖము కలిగినటువంటి రాక్షసులకు శత్రువైనటువంటి వాడా, అలాగే అగస్త్యుని చేత స్తోత్రము చేయబడినటువంటి వాడా, మూడవ-- కనీసం నామంగా అక్కర్లా ఇలా చెప్పినా చాలు.
మూడవది పరమ భాగవతోత్తములైన వారు ఎవరుంటారో వాళ్ళ యొక్క ఈప్సితములను నెరవేర్చేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడా.
ఈ మూడు నామములు చెప్తూ ఆయన యొక్క రూపం గురించి, ఆయన వచ్చిన ప్రదేశం గురించి చెప్పేటప్పుడు పాతాళ వివర స్థాననే నమః.
పాతాళ వివరము నందు లేదా భూవివర స్థాననే నమః, భూవివర నివాసాయ నమః.
భూవివరము అంటే లోపలకు వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ప్రాంతం.
అక్కడ ఉన్నవాడా ఈ నాలుగు నామములు చెప్పాలి.
ఈ నాలుగు నామములు కనీసం దేవాలయం దగ్గర ఓ బోర్డు అన్నా ఉండాలి, తెలియని వాళ్ళ కోసం.
ఉంటే వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ నాలుగు నామములు చెప్పి మెట్లు దిగి విఘ్నేశ్వరుడిని స్తోత్రం చేస్తారు.
End of transcript · 170 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.