Telugu transcript
ఎక్కడి నుంచి వచ్చిందో
ఏమో గానీ ఆమె అడుగుపెట్టిన క్షణం నుండి మా
జీవితాలు మాత్రం తలకిందులయ్యాయి.
మీర్ చాచాకి నాకు ఆమె మొదటి నుంచి నచ్చలేదు. మా మనసు ఏదో కీడు
శంకిస్తూనే ఉంది. ఆమె ఒక మంత్రగత్తె అని,
ఊళ్ళో కొంతమందికి చేతబడి చేస్తుందనే విషయం మాకు కొద్దిరోజుల్లోనే తెలిసింది.
చాచా తను చూసింది చిన్న తమ్ముడు ఫర్దీన్ తో ఎలా చెప్పాలో తెలియక తనలో తానే
మదనపడేవాడు. ఇంతలోనే మసూదా తన బావ కాజా ని వల్లో వేసుకోవడం
చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. మీర్ చాచా తన తమ్ముడికి నచ్చజెప్పాలని చూశాడు.
కానీ అప్పటికే కాజా మసూదా మత్తులో మునిగిపోయాడు. ఎలా పోతే నీకెందుకు?
కొన్ని రోజుల తర్వాత...
ఆ రోజు నా జీవితంలో అత్యంత భయంకరమైన దృశ్యాన్ని చూశాను. ఒక అన్న దయ్యం వలలో పడి
తన సొంత తమ్ముడిని
మోసం చేసి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మీర్ చాచా! మీర్ చాచా!
నేను చూసిందంతా మీర్ చాచాకి చెప్పాను.
End of transcript · 112 words