0:00

ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళయినటువంటి దంపతుల్ని ఒకచోట ఉండొద్దు అంటారు.

0:05

ఒకచోట కొత్తగా పెళ్ళయిన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే, ఏదో అంతకుముందు పెళ్ళవుతుంది, ఏ చైత్ర మాసంలోనో, వైశాఖ మాసంలోనో పెళ్ళయింది అనుకోండి.

0:15

అయితే కొత్తగా పెళ్ళయింది కదూ, వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది.

0:19

ఇవతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది. ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి, లేకపోతే పంట రాదు.

0:24

రైతు తెల్లవారుజామున ఏ మూడు గంటలకో ఆకాశం మబ్బేసి, గాలి వేసి, చినుకులు టప టప పడుతుంటే, గబగబా ఇంట్లో పెద్దాయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు.

0:34

కొడుకు కొత్తగా పెళ్ళయింది, తండ్రి వెంట వెళ్ళాలి. కానీ కొత్తగా పెళ్ళయింది కదూ, భార్యతో కలిసి పడుకుని ఉండిపోతాడు.

0:40

పడుకుని ఉండిపోతే అత్తగారికి కోపం వస్తుంది.

0:43

"పెద్దాయన, మామగారు వెళ్ళారు, ఏ నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించొద్దా? నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి" అంటుంది.

0:50

ఈ ఒక్క నెల ఆషాఢ మాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి, ఆరు నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది.

1:00

అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని, అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు, కోడలు అందరూ సంతోషంగా ఉంటారని, దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు.

1:13

ఆచారం ఏదైనా ఉంటే దాని వెనుక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప, నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు.

1:21

కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు, తప్పు అని ఖండించడం కన్నా దురాచారం, అల్పబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు.

End of transcript · 186 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal