0:00

అంటే గురువు ఏకలవ్యుని బొటనవేలు తీసేసాడు. ఎందుకు తీసేసాడు?

0:04

అంటే ఏదో అర్జునుడి కన్నా గొప్పవాడైపోయాడని తీసేయలేదు.

0:08

పాండవులు ద్రోణాచార్యుల వారితో కలిసి వేటకెళ్లారు.

0:12

వేటకెందుకు వెళ్ళాలి? వాళ్ళు ధనుర్విద్య నేర్చుకున్నారు.

0:15

ఒక పరిగెడుతున్నటువంటి మృగం మీద బాణం వేయగలడా వేయలేడా పరీక్షించడానికి తీసుకెళ్ళాడు.

0:22

అక్కడ వాళ్ళు వేటకుక్కల్ని తీసుకెళ్లారు. వేటకుక్క అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది.

0:30

ఎవరైనా చాలా విచిత్రంగా కనపడ్డారనుకోండి అది మొరుగుతుంది.

0:34

అలా ఆ కుక్క చూసింది ఏకలవ్యుణ్ణి. ఏంటి విచిత్రంగా ఉన్నాడు? ఈ ఈకలన్నీ తలకి కట్టుకున్నాడు.

0:43

మొలకేమో జంతు చర్మం కట్టుకున్నాడు. దానికి విచిత్రంగా అనిపించింది.

0:47

అనిపించి భౌ భౌ అని అరిచింది. తనని చూసి కుక్క అరిచింది అన్న కోపంతో ఆరు బాణాలు ఇలా, ఆరు బాణాలు ఇలా కొట్టాడు కుక్క నోట్లోకి.

0:59

ఎవరైనా ఇలా వేస్తారు. ఇలా వెళ్లి ఇలా, ఇలా వెళ్లి ఇలా ఆరు బాణాలు కుక్క నోట్లో కింది దవడకి, ఆరు బాణాలు పై దవడకి కొట్టాడు.

1:09

కుక్క నోరు మళ్ళీ మూసుకోకుండా, భౌ అని అరవకుండా కొట్టాడు.

1:13

కుక్క వగరుస్తూ వచ్చింది. చూశాడు ద్రోణాచార్యుల వారు.

1:16

అయోగ్యుడికి విలువిద్య దొరికింది ఎక్కడో. ఒక కుక్కకి మొరగడం ధర్మం.

1:22

మొరగడం ధర్మమైనటువంటి కుక్క మొరిగితే ఓర్చలేక ఆరు బాణాలు పైకి, ఆరు బాణాలు కిందకి కొట్టాడు.

1:28

సంస్కారం లేని చోటికి విద్య అబ్బింది. ఈ విద్య వాడి చేతిలో ఉంటే వాడు తన అహంకారంతో ఎవరినైనా పాడు చేస్తాడు.

1:38

వాడికి ఉండకూడదు ఆ విద్య అనుకున్నాడు. వెతుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడిది ఈ విద్య అని అడిగాడు.

1:43

మీ బొమ్మ పెట్టే నేర్చుకున్నాను అన్నాడు. నా బొమ్మ పెట్టి నేర్చుకున్నాడు కదా అని అనుమతించలేదు. నీ బొటనవేలు ఇయ్యి అన్నాడు.

1:49

ఎందుకని? ఖచ్చితంగా ఇతను తప్పు మార్గంలో వెళ్తాడని లెక్కకట్టాడు గురువు.

End of transcript · 193 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal